హైదరాబాద్ ప్రజా పాలన ప్రతినిధి, చిత్రపురి కాలనీలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తున

Published: Saturday November 19, 2022
శుక్రవారం రోజు చిత్రపురి కాలనీలో సిపిఐ పార్టీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాట్లాడుతూ సినిమా రంగంలో సినిమాల ద్వారా ఈ సమాజానికి కళా రూపంలో మంచి సినిమాలను అందిస్తున్నారని ఆయన తెలుపుతూ కానీ సినిమా కళాకారులకే చిత్రపురి కాలనీలో  గత 20 సంవత్సరాల నుండి అన్ని సమస్యలే సినిమా రంగం వారికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కాలనీ నిర్మిస్తూ అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రపురి కాలనీవాసులకు
 ఇళ్ల నిర్మాణం గురించి ఒక కార్పొరేట్ కంపెనీకి ఈ పనులు అప్ప చెప్పడంతో గత 20 సంవత్సరాల నుంచి సినిమా రంగం వారు ప్రతి కుటుంబం ద్వారా 20 లక్షల రూపాయలు గతంలో ఆ కంపెనీకి చెల్లించిన
 ఇప్పటివరకు చిత్రపురి కాలనీలో ఇళ్ల నిర్మాణము ఇప్పటివరకు పూర్తి కాలేదని ఆయన తెలిపారు ఈ కాలనీలో సరియైన రోడ్లు లేవని కరెంటు లేదని నీళ్లు లేవని ఇక్కడ వసతులు సరిగ్గా లేవని ఆయన తెలిపారు ఈ కాలనీ వాసులకు అన్ని సమస్యలే ఉన్నాయని చిత్రపురి కాలనీలో కరెంటు లేక రాత్రి వేళల్లో అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలుపుతూ న్నారు ఇక్కడ ఇండ్లు పూర్తి అయిన వాళ్లు ఇప్పుడు నివాసం ఉంటున్న వారు ఇల్లు పూర్తి కాని వారు అందరూ అసంతృప్తిగానే ఉన్నారని ఆయన తెలిపారు ఇక్కడ చిత్రపురి కాలనీ చైర్మన్ వల్లభనేని అనిల్ ఆయన మాత్రం కోట్లల్లో అక్రమంగా సంపాదిస్తున్నాడని ఆయన తెలిపాడు దీనిపై జ్యూడిషల్ విచారణ జరపాలని ఆయన కోరారు ఈ చిత్రపురి కాలనీలో స్వాతంత్ర సమరయోధుడు ప్రతాప్ లాంటి మహానాయకుడు  ఉన్నవారికి
 ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు చిత్రపురి కాలనీ అసోసియేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్ మాత్రం వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నాడని ఆయన తెలిపారు ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ సినిమా పరిశ్రమ వారికి ఏ కష్టం వచ్చినా తమ పార్టీ అండగా ఉంటాదని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య పుస్తకాల నర్సింగరావు సయ్యద్ అక్బర్ జిల్లా నాయకులు మల్లేశం సత్యనారాయణ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు