కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, ఎంపీప

Published: Friday January 20, 2023

బోనకల్ ,జనవరి 19 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని గురువారం మండలంలోని రామాపురం, గార్లపాడు గ్రామాల్లో మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు గ్రామీణ ప్రాంతాల వారు పేదవారు కంటి చూపు లేక ఆసుపత్రికి వెళ్లి చూయించుకునే ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి వారికి కోసం వైద్యులు గ్రామానికి వెళ్లి కళ్ళ పరీక్ష చేసి సమస్యకు సంబంధించిన కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేస్తారని, మండలంలోని కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్, బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, రామాపురం, గార్లపాడు సర్పంచులు తొండపు వేణు, దారెల్లి నరసమ్మ, ఆశా కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.