మళ్ళింపు కాలువల పని వేగవంతం చేయాలి

Published: Friday January 28, 2022
వికారాబాద్ ఎంపీడీఓ మలుగ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : ఉపాధి హామీ పనులలో భాగంగా మళ్ళింపు కాలువల పనిని వేగవంతం చేయాలని వికారాబాద్ ఎంపీడీఓ మలుగ సత్తయ్య సూచించారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో గ్రామ సర్పంచ్  కెరెల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మలుగ సత్తయ్య మాట్లాడుతూ నర్సరీ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. 15 వేల మొక్కలు పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని కొనియాడారు. 15వేల బ్యాగులలో మట్టితో నింపి విత్తనాలు నార్లు వేశారని స్పష్టం చేశారు. నీళ్లు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారని వివరించారు. గ్రామంలో కంపోస్ట్ షెడ్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఎరువు తయారు చేస్తున్నారని ఉద్ఘాటించారు. చాలా సారవంతమైన ఎరువు తయారు చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఆ ఎరువును తెలంగాణకు హరితహారంలోని మొక్కలకు వేస్తున్నారని చెప్పారు. మొక్కలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. గ్రామంలో రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటారు. అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతున్నాయన్నారు.  నారాయణపూర్  గ్రామంలో మల్లింపు కాలువల పని పర్యవేక్షించడం జరిగింది. అక్కడ 40 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందయ్య పంచాయతీ కార్యదర్శి సంజీవ్ నారాయణపూర్ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.