మహిళా దినోత్సవ వేడుకలు

Published: Tuesday March 09, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా తహశీల్దార్ నాగలక్ష్మికి శాలువాలతో పులమాలతో ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ మహిళలే అవకాశాలు సృష్టించుకునే స్థాయికి ఎదిగి మహిళలు అబలలు కాదు సబలలు అని నిరూపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రామానుజా చార్యులు, జూనియర్ అసిస్టెంట్ శివాజీ, విఆర్ఓ లు, విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు.