పాల ఉత్పత్తులపై పెంచిన జిఎస్ టి ని తగ్గించాలని నిరసన

Published: Thursday July 21, 2022

ఎమ్మెల్యే డా. సంజయ్

జగిత్యాల, జులై 20 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ తహసిల్ చౌరస్తా లో టీఆరెఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పాలపై మరియు పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం  జిఎస్ టి ని తక్షణమే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టగా  జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ఎంపీపీ లు, జెడ్పీటీసీ, పాక్స్ ఛైర్మెన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసి లు, రైతు బంధు సమితి నాయకులు, ఎఎంసి, పిఎసిఎస్  డైరెక్టర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మేల్యే డా.సంజయ్  మాట్లాడుతూ తెలంగాణ చిన్న రాష్ట్రం అయిన కేంద్ర ప్రభుత్వం నికి టాక్స్ రూపం లో అత్యధిక నిధులు అందజేస్తున్నమని అన్నారు. పాల పదార్థాలు మానవ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని, అలాంటి పాల ఉత్పత్తుల పై జిఎస్ టి ద్వారా ఆరోగ్యాన్ని దెబ్బ తీయటమేనని అన్నారు. స్థానిక బీజేపీ ఎంపి లు ఇక్కడి సమస్యలు పిఎం  దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రూపాయి పతనం ద్వారా దేశం విలువ కూడా పతనం అయినట్లే నని అన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దోరణి వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెంపు ద్వారా సామాన్యుల నడ్డి విరిచే ప్రయత్నం అని,పాల పై కూడా జిఎస్ టి పెంచడం ద్వారా సాధారణ మధ్యతరగతి ప్రజల కు ఇబ్బంది అని, పేద వారి పొట్ట కొట్టి పెద్దోళ్ల కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని, సామాన్యుడు ఉదయాన్నే పాలు, చాయి తాగితేనె రోజు పనులు మొదలు అవుతాయి అని అన్నారు.