పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా చర్యలు ** నీతి అయోగ్ ప్రతినిధి

Published: Thursday August 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రతినిధి అన్నారు. బుధవారం కేంద్రం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి మాట్లాడుతూ  పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పోషక విలువలు గల చిరుధాన్యాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు సమయానుకూలంగా పోషక ఆహారాన్ని అందించడంతో పాటు ఎప్పటికప్పుడు పరీక్షించి  అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో చిరుధాన్యాలను పంపిణీ చేయడంతో పాటు పిల్లలు, మహిళలు, ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, సంబంధిత శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area