అన్నదానం అభినందనీయం రంగా హనుమంతరావు మధిర రూరల్ డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో

Published: Wednesday December 07, 2022

ఆత్కూర్ క్రాస్ రోడ్ లోని మంగళవారం నాడు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులురంగాహనుమంతరావు,మధులత  ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగా హనుమంతరావు మాట్లాడుతు అన్నదానం చేయటం అభినందనీయమని, అన్నదానం నిరుపేదలకు ఎంతోఉపయోగపడుతుందని, అన్నదాతలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అన్నదానం నిర్వహించే నిర్వహికులను అభినందించారు. అన్నదాతలు రంగా హనుమంతరావు ధర్మపత్ని మధులత, వెలగపూడి రవి ధర్మపత్ని రజిని ఈ కార్యక్రమంలో పిక్కిలి పుల్లయ్య,వెలగపుడిహనుమంత రావు, డాల్ కృష్ణ పాల్గొన్నారు