కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ మంజూరు పట్ల హర్షం ప్రకటించిన మద్దెల శివ కుమార్

Published: Wednesday May 19, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం నకు దశాబ్దాల కాలంగా నెరవేరని సుదీర్ఘ స్వప్నం గా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మంజూరు కార్యరూపం దాల్చడం పట్ల కొత్తగూడెం శాసన సభ్యులు అపర భగీరధుడు అభివృద్ధి సాధకుడు అయినా శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి కృషి ప్రశంసనీయమని కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ యొక్క ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విశదీకరించి వారిని మెప్పించి ఒప్పించిన ఘనత శ్రీ వనమా గారి దేనని వారి అవిరళ కృషి అభినందనీయమని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్  ఉద్ఘాటించారు 18 05 2021 నాడు కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ మంజూరీ అయినందున మద్దెల తన సంఘం తరఫున హర్షం ప్రకటిస్తూ ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన నందున అటు గిరిజనులకు ఆదివాసీలకు మరియు సింగరేణి కాలరీస్ స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ నవభారత్ ఫెర్రో అల్లాయిస్ కేటీపీఎస్ బి టి పి ఎస్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లాంటి ఎన్నో కర్మాగారాలను కలిగి ఉన్నందున అటు కార్మికుల పిల్లలకు ఎందరికో ఉపయుక్తంగా ఉంటుంది అందువలన అది కార్య రూపం దాల్చే వరకు దీక్షా కంకణ దారులై ఉండాలని మద్దెల శ్రీ వనమాకు విజ్ఞప్తి చేశారు హర్షం ప్రకటించిన వారిలో మద్దెల తోబాటు జిల్లా గౌరవాధ్యక్షులుకూ సపాటి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు ప్రముఖ కళాకారులు సింగర్ ఆఫ్  సింగరేణి అపర బాలు అల్లి శంకర్ ప్రముఖ సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వామి సినీ నటులు టి ధనరాజ్ గౌరవ సలహాదారులు సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్ చంద్రగిరి గోపీచంద్ సబ్బవరపు మధుసూదన్ చిన్ని కోలపూడి ధర్మరాజు ప్రముఖ న్యాయవాది అభ్యుదయవాది అబ్దుల్ రజాక్ సంఘ నాయకులు పొన్నెకంటి సంజీవ రాజు అంతోటి పాల్ ఉప సర్పంచ్ దుర్గేష్ లావుడియా సత్యనారాయణ మూడు బాలు నాగేందర్ బుస్సీకానిస్టేబుల్ శ్రీనివాస్  అంతోటి రాజు స్టీవెన్ తోత పాష తదితరులు ఉన్నారు