నిరుపేదల ఆకలి తీర్చుతున్న జనహిత సేవా సమితి

Published: Wednesday April 27, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో, కొన సాగుతున్న జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం, మంగళవారం నాటికి 84వ రోజుకు చేరుకుందని జనహిత సేవాసమితి అధ్యక్షులు, ఆడెపు సతీష్ తెలిపారు. మంగళ వారం ఆయన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు అన్ని దానాల్లోకన్న, అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారికి, ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని, దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు, 2021లో  ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న ప్రారంబించడం జరిగిందని, దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం నాటికి 84వ సారికి చేరుకుందని, ఈరోజు అన్నదాన కార్యక్రమం కొరకు దాతలు, సేవా సమితి సభ్యులు, గాజుల లావణ్య, కైలాష్, దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నిరుపేదలకు, కూలీలకు, చిరువ్యాపారులకు, బాటసారులకు యాచకులకు, ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల రమాదేవి, కార్యవర్గ సభ్యులు సింగతి తిరుమల్, కందుల రాజన్న, పొలంపల్లి రాజేశ్, నిచ్చకోలా గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.