ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి

Published: Saturday August 20, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 19, ప్రజాపాలన: ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్  ఆధ్వర్యంలో శుక్రవారం రోజున  ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వర్కర్ల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న పెషేంట్ కేర్, వార్డు బాయ్స్, సెక్యూరిటి గార్డ్ ఇతర విభాగల్లో పని చేస్తున్న వర్కర్ల సమస్యలు పరిష్కరించి, జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయల వేతనం చెల్లించలాని, నాలుగు నెలల గా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలనీ, లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చిప్పకుర్తి కుమార్, లక్ష్మి, సంధ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.