తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన...

Published: Thursday March 10, 2022

బీరుపూర్, మార్చి 09 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగా విరుద్ధంగా ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను శాసనసభలో జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండ సస్పెండ్ చేయడం దారుణమని బీర్పూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఎనగందుల చంద్రశేఖర్ దుట నరేందర్ చిక్రం మారుతి కంది రమేష్ సబ్బ దేవరజన్ పెండల ప్రతాప్ గంగన్న మడిశెట్టి శ్రీను చిర్నేని భాస్కర్ అరెళ్లి తిరుపతి పర్వతం శ్రీను శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు