కరోనా బాధితుల ఉచిత భోజన ఈ కార్యక్రమానికి రూ.5 వేల రూపాయలు విరాళంగా అందజేసిన డాక్టర్ నాదెండ్ల

Published: Friday June 18, 2021

బోనకల్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : బోనకల్  నెల 23 వ తారీకు నుండి కొండ - అండ కార్యక్రమం ద్వారా మండల మాజీ జెడ్పిటిసి బానోతు కొండ కరోనా బాధితులకు మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యాన్ని అందిస్తున్నారు ఉచిత భోజన సౌకర్యం కొండ - అండ కార్యక్రమానికి బోనకల్ మండల సుపరిచితులు డాక్టర్ నాదెండ్ల కిషోర్ కుమార్ 26వ రోజు గురువారం కరోనా బాధితులకు ఏర్పాటుచేసిన ఉచిత అన్నదాన కార్యక్రమానికి రూ 5000 రూపాయలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ నాదెండ్ల కిషోర్ కుమార్ మాట్లాడుతూ. కరోనా వైరస్ మనదేశంలో ప్రవేశించినప్పటి నుంచి జనజీవనం అతలాకుతలం అయిందని, కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి  చిన్నాభిన్నమైనయాని, మొదటిదశలో లాక్ డౌన్ వల్ల భారతదేశం మొత్తం కొన్ని నెలలపాటు స్తంభించిపోయిందని, దీంతో భారత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండో దశ కరోనా వైరస్ వచ్చిన తర్వాత వేల కుటుంబాలలో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులు, పసిపిల్లలు అనాధలైన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఏదిఏమైనా కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అంతం అయినప్పుడే జన జీవన  పరిస్థితి కుదుటపడుతుందని, అతి త్వరలోనే కరోనా మహమ్మారి అంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బోనకల్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి బానోతు కొండ కరోనా బాధితులకు అండగా నిలిచి వారికి మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యం అందించడం చాలా గొప్ప విషయం అన్నారుఇంత గొప్ప కార్యక్రమానికి నా వంతు బాధ్యతగా 5000 రూపాయిలు ఆర్థికంగా సహాయం చేయటం జరిగిందని డాక్టర్ నాదెండ్ల కిషోర్ కుమార్ అన్నారుగతంలో కూడా బోనకల్ గ్రామ మరియు మండల ప్రజలకు రెండు సంవత్సరాల పాటు ఉచితంగా వైద్య సేవలు చేసినట్టు ఆయన తెలిపారు కరోనా బాధితుల కొరకు నేను చేస్తున్న కార్యక్రమానికి నాకు మద్దతుగా నిలుస్తున్న దాతలందరికీ  ప్రత్యేకమైన అభినందనలని మాజీ జెడ్పిటిసి బానోతు కొండ తెలియజేశారు భోజనాలు పంపిణీ చేసిన వారిలో అంతోటి అది, బోడ అంజి, గూగులోతు శేఖర్, బోడా కృష్ణ, ధరావత్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు