అన్నం పెట్టే రైతన్నల నోట్లో సున్నం పెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

Published: Wednesday November 17, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 16 ప్రజాపాలన ప్రతినిధి : వరి ధాన్యం కోనుగోలు విషయంలో స్పష్టత లేదని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం అంత వరిని పండించి ఆరబోతకు ఎక్కడపడితే అక్కడ ధాన్యంకళ్ళాలు, కోనుగోలు కేంద్రాలు లేక అరభోస్తు తిప్పలు పడుతున్నారు.. దానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పడినట్లు చలనం లేదు వచ్చే యాసంగిలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కాకుండా దాల్ రైస్ కొనడం ప్రభుత్వం ముందుకు తెచ్చింది.. ఈ వానాకాలం వదులుకొని బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వాలు చేపట్టడం చోచనీయంగా వుంది అన్నారు. ఒకవైపు రైతు వ్యవసాయ నల్లాచట్టాలు, విద్యుత్, కార్మీక చట్టాల సవరణలు అవలంబిస్తున్న రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదన్నారు.. ఎఫ్ సిఐ 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నా పాలకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు దళారులను ప్రోత్సాహానికి స్తున్నారు.. రైతులను అయోమయంలో పడేవేసే ప్రకటనల కంటే వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు.