కాంట్రాక్టు కార్మికులను అరెస్టు చేయడం పనికిమాలిన చర్య సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

Published: Wednesday September 14, 2022

బెల్లంపల్లి సెప్టెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి: అపరిస్కృత సమస్యల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న కార్మికులను అరెస్టు చేయడం హేయ మైనా, పనికిమాలిన చర్య గా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు.

మంగళవారం నాడు పలువురి విలేకరులతో మాట్లాడుతూ సమ్మెలో పాల్గొంటూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళుతున్న జాక్ నాయకులు దూలం శ్రీనివాస్ (సిఐటియు) జాఫర్ (ఐ ఎఫ్ టి యు) మరి కొంతమందిని అర్ధరాత్రి బెల్లంపల్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ అక్రమ అరెస్టులను, నిర్బంధాలను, నిలిపివేయాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు,

కాంట్రాక్టు కార్మికుల సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సింగరేణి యాజమాన్యాన్ని సిపిఎం జిల్లా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యల విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం, స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేసి సమస్యలను సాధించుకుంటామని ఆయన హెచ్చరించారు.