వార్డెన్, సిబ్బందిని పై చర్యలు తీసుకోవాలని మంత్రి కి ఎస్ఎఫ్ఐ వినతి

Published: Friday February 19, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి18, ప్రజాపాలన: విద్యార్థిని మృతికి కారణమైన వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాతోడ్ కు ఎస్ఎఫ్ఐ,టిఏవిఎస్ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. మంతి జిల్లా పర్యటన లో బాగంగా బెల్లం పెళ్లి వచ్చిన సందర్భంగా ఆమెను కలసి సంఘం వివరాలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని ఇంటీగ్రెటెడ్ గర్ల్స్ హస్టల్ లో 9వ తరగతి చదువుతున్న బత్తుల మనిషా గుడిపల్లి గ్రామం, మందమర్రి మండలానికి చెందినా విద్యార్థిని ఈ నెల 12 న అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగిందని గుర్తుచేశారు. ఐతే పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవలసిన అధికారులు బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో కాలం వెల్లదీస్తున్న ఎస్సీ సాంఘిక సంక్షేమ జిల్లా అభివృద్ధి అధికారినీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటన పై స్పందించి విద్యార్థి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. పూర్తి విచారణ చెసి భాద్యులపైన చర్యలు తిసుకోవాలని లెని యెడల జిల్లా వ్యాప్తంగా అందోళన కార్యక్రామాలు చేపడతామని పేర్కొన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మారుమురు గిరిజన తండాల్లో  ఉంటున్న గిరిజన విద్యార్థులకు జిల్లాలో గిరిజన గురుకులలు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, జిల్లాలో గిరిజన గురుకులాలను ఏర్పాటు చేయాలని కోరారు. అద్దె భవనంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. విద్యార్థి మృతి పై న సమగ్ర విచారణ చేసి బాధ్యులను సస్పెండ్ చేసి, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని, జిల్లాలో గిరిజన గురుకుల ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ, టిఏవిఎస్ నాయకులు సిహెచ్.మహేష్, కె. మారుతి, యు. శివ, సురేష్, హరీష్, లెనిన్ తదితరులు ఉన్నారు.