ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కంటిని కాపాడుకుందాం నిర్లక్ష్యం వహిస్తే జీవితమంతా చీకటే : డా

Published: Wednesday July 27, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన/జూలై 26 :మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి నేత్రాలేనని, వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం అంతా చీకటిమయమేనని డాక్టర్ రామ్స్ పేర్కొన్నారు. మంగళవారం నల్లగండ్లలో గల ప్రభుత్వ పాఠశాల యందు విద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు డాక్టర్ రామ్స్ ఐ క్లినిక్ విజయ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు   
నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్స్ మాట్లాడుతూ సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అని అన్నారు. కనులు ఆరోగ్యంగా ఉంటేనే మనం చూడగలుగుతామని, లేకపోతే అంధకారమే అని అన్నారు. మారిన జీవన శైలి పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఇటీవల కాలంలో కంటికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా సెల్ ఫొన్, కంప్యూటర్ ఉపయోగించే వారికి నేత్ర సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, కంటి సమస్యలు కళ్ళు మండటం, తలనొప్పి, కంటి నుండి నీరు కారటం, దురదలు, కండ్ల కలకలు లాంటి ఇతర సమస్యలు కనపడితే అశ్రద్ధ చేయకుండా వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించి వారి సూచనలు సలహాలను పాటించి నేత్రాలను కాపాడుకోవాలని తెలిపారు. తాజా ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్, ఉసిరి, మొక్కజొన్న , చేపలు, బ్లూ బెర్రీస్ లాంటి ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్ర రెడ్డి, విజయా హాస్పిటల్ ఎండీ అల్లం పాండు రంగారావు హాస్పిటల్ ప్రతినిధి అల్లం అనిరుధ్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, నల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్, నల్లబోయిన నవీన్ యాదవ్, పాలం శ్రీను ఉపాధ్యాయులు, పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నార
 
 
 
Attachments area