పంటకోత ప్రయోగములను పకడ్బందీగా నిర్వహించాలిమధిర

Published: Wednesday October 19, 2022
అక్టోబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర డివిజన్లో పంటకోత ప్రయోగాలను పగడ్బందీగా నిర్వహించాలని మధిర వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం వ్యవసాయ శాఖ మధిర డివిజన్ రైతు వేదిక నందు మండల వారీగా గ్రామ స్థాయిలో పంటల దిగుబడి అంచనా నిమిత్తం వ్యవసాయ సహాయ సంచాలకులు  కొంగర వేంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర వ్యవసాయ డివిజన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మరియు ముదిగొండ మండలాల్లో నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాలను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా వానాకాలం సీజన్ పూర్తయి అక్టోబర్ మొదటి నుండి యాసంగి కాలం ప్రారంభమయినందున వానాకాలంకు సంభంధించిన పంటకోత ప్రయోగాల ఫారాలను తక్షణమే సమర్పించాలన్నారు. యాసంగి పంటల నమోదు ప్రారంభించాలని పంటల వివరాలు నమోదు చేయుట చాలా ముఖ్యమైనదని ఆయన తెలిపారు.   పంటకోత ప్రయోగాలు మండల స్థాయిలో ఎంపికయిన గ్రామాల నందు ఈ ప్రయోగాలు బహుళ దశ స్థరిత యాధృశ్చక పద్ధతిలో నిర్వహించి నిర్ధిష్ట పరిమాణము కలిగిన ప్లాటులో పంటకోత ప్రయోగాలు నిర్వహించాలని ఉప గణాంకాధికారులు కృష్ణారావు, కృష్ణయ్య, గులాబ్ సింగ్ పేర్కొన్నారు. ఈ యొక్క పంటకొత ప్రయోగాలు కొత్త డిల్లీలోని భారతీయ వ్యవసాయ గణాంకాల పరిశోధన సంస్థ  సూచించిన పద్ధతి ప్రకారం నిర్వహించి ప్రధానమైన ఆహార మరియు ఆహారేతర పంటల సరాసరి దిగుబడి ఒక హెక్టారుకు ఉత్పాదకత  అంచనా వేయుటకు  పంటకోత ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మరియు ముదిగొండ మండలాల వ్యవసాయ శాఖకు చెందిన మండల వ్యవసాయ అధికారులు విజయభాస్కర్రెడ్డి, శరత్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ప్రణాళిక శాఖకు చెందిన ఐదు మండలాల మండల ప్రణాళిక అధికారులు సాయి కుమార్ నాగేశ్వర రావు, నజీర్ మరియు రామక్రిష్ణ  పాల్గొన్నారు.