గోవిందపురం (ఏ) గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Published: Saturday March 26, 2022
బోనకల్ మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం (ఏ) గ్రామంలో సర్పంచ్ భాగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మమత హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అనుభవజ్ఞులైన డాక్టర్ ల చే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ భాగం శ్రీనివాసరావు మాట్లాడుతూ, కనీసం పది హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారని అన్నారు. గ్రామంలో ప్రజలు తమ సమస్యల గురించి చెప్పగా వారికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, మేడిపల్లి కోటేశ్వరరావు, కావూరి జనార్దన్ రావు, కావూరి శంకర్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమ బిందు, మమత హాస్పిటల్ డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది గ్రామపంచాయతీ వర్కర్స్ దార సురేష్ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.