సీఎం కేసీఆర్ ను గద్దె దించాలి..

Published: Friday February 04, 2022
యస్.పి కోఆర్డినేటర్ ఏపూరి..
తల్లాడ, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన న్యూస్): సీఎం కేసీఆర్ ను ఆ పదవి నుండి గద్దె దించాలని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. గురువారం తల్లాడ, తెలగవరం, గొల్లగూడెం, అన్నారు గూడెంలో కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసారు. బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర్ర నాయకులు ఇస్నేపల్లి అశోక్, ఇస్నేపల్లి వెంకటేశ్వర్లు, ఏపూరి రామారావు, కోట వంశీ, ఇస్నేపల్లి వీరయ్య, ఇస్నపల్లి లక్ష్మణ రావు, ఇస్నపల్లి నర్సింహారావు, జి నరసింహారావు, విద్యార్ధులు పాల్గొన్నారు.