దేశవ్యాప్త సమ్మె మార్చి 28,29 కరపత్రం విడుదల

Published: Tuesday March 22, 2022
మంచిర్యాల టౌన్, మార్చి 21, ప్రజాపాలన: దేశ వ్యాప్తంగా జరుగు  మార్చి 28, 29 సమ్మెకు సంబందించిన కరపత్రంను మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట విడుదల చేయడం జరిగింది .ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు, కార్పొరేటర్ చేతుల్లో పెట్టె ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కార్మికులకు రక్షణ గా ఉన్నటువంటి చట్టాలను తొలగించే కుట్ర పన్నుతుందని బిజెపి నుండి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మన దేశ సంపదను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే ఈ నెల 28, 29వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు,కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం కార్మికులు లక్ష్మి, శారదా, లింగమ్మ, గౌరు, లాస్మక్క నాయకులు పాల్గొన్నారు.