పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం సంపూర్ణ ఆరోగ్యం: ఏ సి డి పి ఓ కమల ప్రియ

Published: Wednesday September 21, 2022

బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని అన్ని గ్రామాలలో పోషకాహార మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రావినూతల గ్రామంలో పౌష్టికాహారం మహోత్సవాల్లో భాగంగా ఏ సి డి పి ఓ కమల ప్రియ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ మాట్లాడుతూ తక్కువ ఖర్చులో లభించే అధిక పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కిశోర పాలికలకు వివరించారు. అనంతరం రక్తహీనత గురించి అవగాహన కల్పించారు. ఐరన్ కలిగిన ఆకుకూరలు, కూరగాయల వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆర్ బి ఎస్ కే టీం వారు హెచ్బి టెస్ట్ లు నిర్వహించారు. వీరంతా కలిసి పోషకాహార ప్రాముఖ్యతను తెలిపేందుకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఇందిరా జ్యోతి, రావినూతల ఉపసర్పంచ్ బోయినపల్లి కొండలు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, ఏఎన్ఎం సరోజ, అంగన్వాడి టీచర్లు శివ నాగేంద్ర, సిహెచ్ ఉష, బి ఉష, ఆలిస్, వై రమాదేవి పాఠశాల ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.