మా భూములు మాకు ఇప్పించండంటు తంగడపల్లి రైతుల ఆవేదన

Published: Saturday October 01, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): నిరుపేదలైన మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొంతమంది దళారులు కబ్జా చేయాలని చూస్తున్నారని తంగడపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే :
తంగడపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 633 లో ఉన్న సీలింగ్ పట్టాను రైతులు సిలివేరు యాదయ్య తండ్రి సాయిలు కు 1ఎకరం, సిలువేరు అడవయ్య తండ్రి లింగయ్యకు 1 ఎకరం, బొడ్డు పొట్టయ్య తండ్రి రాములు కు 1 ఎకరం, ఆకిటి చంద్రయ్య తండ్రి ఎల్లయ్యకు 2 ఎకరాలు, కేతరాజు బుచ్చయ్య తండ్రి వెంకయ్యకు 1 ఎకరం, బొమ్మ కంటి మల్లయ్య తండ్రి వీరయ్య కు1 ఎకరం, సొప్పరి శంకరయ్య తండ్రి పాపయ్యకు 1 ఎకరం, అంతటి స్వామి తండ్రి రాజయ్యకు 2 ఎకరాలు, ఇప్ప మల్లయ్య తండ్రి నరసయ్య కు 2 ఎకరాల, భూమిని. సదరు పదిమంది రైతులకు 1975 వ సంవత్సరం ప్రభుత్వం పట్టా చేయగా. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న తంగడపల్లి గ్రామం దినదిన అభివృద్ధి చెందుతున్న సందర్భంగా. తంగడపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళారులు కబ్జా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సమావేశంలో రైతులు మాట్లాడుతూ 1975 వ సంవత్సరంలో ప్రభుత్వం మా యందు దయతలిచి సర్వేనెంబర్ 633 సీలింగ్ పట్టా నుండి 16 ఎకరాల భూమిని మా 10 మందికి చేశారన్నారు. అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ మాకు పట్టా పత్రాలు ఇచ్చారని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుబంధు కూడా ఇస్తున్నారని. అట్టి భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న మాపై తంగడపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దళారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మా భూముల్లో కడీలు నాటుతూ కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకుని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మాపై పలుమార్లు దళారులు దౌర్జన్యం చేస్తే పోలీసులు ఆశ్రయించడంతో ఆ దళారులపై కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. అయినను కూడా మాపై ఆ దళారులు దౌర్జన్యం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే మా యొక్క భూమిని సర్వే చేయించి ప్రభుత్వం ఇచ్చిన మా భూమిని మాకు ఇప్పించాలని అధికారులను ఈ సందర్భంగా వేడుకున్నారు. లేనియెడల ఆర్డీవో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఇప్ప మల్లయ్య, దానయ్య, అడవయ్య, పొట్టయ్య, చంద్రయ్య, బుచ్చయ్య, లక్ష్మయ్య, మల్లయ్య, శంకరయ్య, స్వామి, పాల్గొన్నారు.
 
 
 
Attachments area