ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంటుకు ఆధార్ నంబరుకు లింక్ చేసుకోండి లేనట్లయితే పీఎం కిసాన్ డబ్బులు

Published: Friday September 02, 2022
పాలేరు సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయం నేలకొండ పల్లి నందు ఎస్. విజయ్ చంద్ర గారు (ఏ డి ఏ కుసుమంచి) సహాయ వ్యవసాయ సంచాలకులు, కుసుమంచి వ్యవసాయ  విస్తరణ అధికారులకు అన్ని కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పంటల నమోదు తగతిన పూర్తి చేయాలని ఏఈవో లను ఆదేశించారు. ప్రతీ సర్వేనంబరును ఏఈవోలు సందర్శించి, పంటల వివరాల పక్కగా నమోదు చేయాలని సూచించారు. పధకం లో ఈ- కేవైసీ అనగా బ్యాంక్ అకౌంటు ను ఆధార్ నంబరుకు లింక్ చేసుకోనట్లయి తే  12వ విడత  పీఎం-కిసాన్ డబ్బులు రైతులకు జమ కానని, ఎట్టి పరిస్థితుల్లో రైతులంతా మీ సేవ సెంబర్ లో కాని, కామన్ సర్సీస్ సెంటర్  లలో కాని ఈ- కేవైసీ చేయించుకోవాలని రైతులకు  తెలియజేయలని. ఏఈవోలకు ఆదేశించడం కరిగింది. నేలకొండపల్లి మండలంలో ఇంకా 2400 మంది రైతులు ఈ- కేవైసీ  చేస్కోని వారు ఉన్నారని, వారి జీబితాను గ్రామపంచాయ -టి లో ప్రదర్శించి, మైకుల ద్వారా చాటింపు వేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి
 ఎస్ వి కె నారాయణ రావు మరియు ఏఈవోలు రామకృష్ణ, అరవింద్, ఉదయ్, అవినాష్, శశిరేఖ, సాయి నిఖిల, దుర్గా భవాని, శిరీష పాల్గొన్నారు.
 
 
 
Attachments area