పెంచిన ధరలను తగ్గించకపోతే మోడీ, కేడి ప్రభుత్వాలను ప్రజలు పాతాళంలోకి తొక్కడం ఖాయం : కాంగ్రెస

Published: Friday April 01, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 31 ప్రజాపాలన ప్రతినిధి : పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మల్ రెడ్డి రంగారెడ్డి సూచన మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది.. ఈ సందర్భంగా సిలిండర్ లకు దండలు వేసి, డప్పులు మోగిస్తూ మోడీ, కేసీఆర్ పాలన మాకొద్దంటూ వినూత్న రీతిలో నిరసన తెలపడం జరిగింది.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ధరలు తగ్గిస్తూ, తీరా ఎన్నికల అనంతరం ధరలు పెంచుతూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని, మోడీ కేవలం మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, పేద ప్రజల నడ్డి విరిచేలా పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసారు... కరోనా కష్టకాలంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టిందని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు దోచిపెడుతూ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కుటుంబాలను నష్టాల్లోకి నెట్టిందని, పెంచిన ధరలతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజానీకం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని, పెంచిన ధరలను తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజానీకానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు... ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి  గుర్నాథ రెడ్డి... పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.. జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ తో పాటు కౌన్సిలర్స్ పంది శంకర్,ఆకుల మమతా నందు..సుల్తాన్ బేగం, నరాల విశాల సాగర్ మరియు సీనియర్ నాయకులు తాళ్ల బాల శివుడు గౌడ్, మంకాలా కరుణాకర్, యాదగిరి, రాజశేఖర్ రెడ్డి .. సొప్పరి రవికుమార్ గౌస్.. ఫిరోజ్ మరియు యువజన కాంగ్రెస్నాయకులుసంజు, నవనీత్, జైహింద్, నందు, వరుణ్, నిఖిల్, రవినాయిబ్రాహ్మణ, శ్రీనివాస్, పారిజాత, సుజాత, అండాలు తో పాటు యువజన కాంగ్రెస్ ఎన్ ఎస్ యూ ఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.