విజయవంతంగా ముగిసిన భారత్ జోడో పాద యాత్ర * మహారాష్ట్రలోకి ప్రవేశించిన యాత్ర * అక్టోబర్ 23న మక్త

Published: Wednesday November 09, 2022
వికారాబాద్ బ్యూరో 08 నవంబర్ ప్రజాపాలన : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాద యాత్ర విజయవంతంగా ముగిసిందని వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు కాకి రంగరాజ్ ముదిరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకే భారత్ జోడో పాదయాత్ర లక్ష్యమని అన్నారు. అక్టోబర్ 23న మక్తల్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో పాదయాత్రకు విశేష స్పందన లభించిందని స్పష్టం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని గుడిబెలూర్ గ్రామంలో భారత్ జోడో పాదయాత్ర ప్రారంభించి జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ గ్రామం వరకు సుమారు 375 కి.మీ. పాదయాత్ర ముగిసిందన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రలో యువతీయువకుల భాగస్వామ్యం అద్వితీయమని కొనియాడారు. దేశ సమైక్యతకోసం పేదల పెన్నిధిగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లలో భాగస్వామ్యం కావడం మహదానందాన్ని పొందగలిగానని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆప్యాయతానురాగాలతో మాలో ఏదో కొత్త శక్తి ఆవహించినట్లుగా తోచిందని గుర్తు చేశారు.16 రోజులలో 4 రోజుల విరామంతో 12 రోజులపాటు 375 కి.మీ సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర నిర్దేశించుకున్న నెరవేరిందని చెప్పారు. తెలంగాణలో పూర్తి చేసుకున్న పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించిందని వివరించారు. చివరి రోజు రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగడం మధురానుభూతిని మిగిల్చిందన్నారు.