వైద్యుల సేవలు మరువలేనివి

Published: Wednesday May 26, 2021
డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు
పరిగి, మే 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఉదయం డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ మరియు కాంగ్రెస్ పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మల్లేష్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్బంగా డిసిసి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఆసుపత్రులే దేవాలయాలుగా, వైద్యులే దేవుళ్లుగా, ఆక్సిజనే సంజీవణిగా భావిస్తున్న ఈసమయంలో ఆసుపత్రులలో బెడ్లు దొరకక అల్లాడుతున్న ఈ సమయంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసుపత్రిలో గల సిబ్బందితో అక్కడ ఉన్న పరిస్థితులను, జరుగుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని గదులలో నిరూపయోగ స్థితిలో పడకలు ఉండటం గమణార్థం అని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన ఆసుపత్రి నిరుపయోగంగా ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. పరిగి హాస్పత్రి లో 27 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 7 మంది మాత్రమే ఉండటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోన పరీక్షల నిమిత్తం వచ్చేవారికి అందరికీ టెస్టులు చేయాలని, వచ్చినవారికి కనీస వసతులు కల్పించాలని కోరారు. కరోన పరీక్ష అనంతరం పాజిటివ్ వచ్చిన వారు బస్సులలో, ఆటోలలో ఇంటికి వెళ్ళే సందర్భంలో తోటి ప్రయాణికులకు కూడా వ్యాధి సోకె అవకాశం ఉందని వారిని అంబులెన్సు ద్వారా వారి గృహాలకు చేర్చాలని అన్నారు. గ్రామాల్లో కరోన పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల అధికారుల పరివేక్షణ లేకపోవడం వల్ల యథేచ్ఛగా తిరగటం మూలన వ్యాధి మరింత విజృంభించే అవకాశం ఉంటుంది కావున అధికారులు వారిపట్ల పరివేక్షణ అవసరం అని అన్నారు. అందరికి వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఇంతపెద్ద ఆసుపత్రిలో కనీసం స్వీపర్ కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఖాళీ అయిన ఆక్సిజన్ నింపి ఇచ్చి కొత్త ఆక్సిజన్ సిలిండర్లు అందజేశామని ప్రచారం చేసుకునే కొందరు నాయకులకు ఈ సమస్యలు కనిపించలేవా అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పరిగి ఆసుపత్రిలో ఐసోలెషన్ వార్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. సరైన సిబ్బందిని వెంటనే నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, ఎర్రగడ్డ పల్లి కృష్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జనుపుల శ్రీనివాస్ పాల్గొన్నారు.