రైతు బీమా,మిషన్ భగీరథ తెలంగాణ క్షేమ పథకాలు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే కాలె యాదయ్య.

Published: Friday September 30, 2022

చేవెళ్ళ సెప్టెంబర్ 29: ( ప్రజా పాలన):


మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అర్హులకు ఆసరా పెన్షన్స్, మహిళలకు బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వయంగా అందజేశారు. గురువారం తంగడపల్లి, కుమ్మెర, మల్కాపూర్, కేసారం గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆయా... గ్రామా సర్పంచ్ ల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు అవ్వలకు , తాత లకు, వికలాంగులకు, వితంతువులకు, పుట్టినింటి  మెట్టినింటి ప్రేమను నోచుకోని  ఒంటరి మహిళలకు సహితం ఆసరా పింఛన్లు అందజేయడం యావత్ దేశానికి గర్వకారణమన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయన్నారు. మల్కాపూర్ గ్రామంలో గతంలో తాగునీటి కోసం మంత్రిని అడ్డగించిన విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. మిషన్ భగీరథ నీరు వచ్చిన తర్వాత ఆ సమస్య తీరిందన్నారు.  కేసారం గ్రామంలో నెలకొన్న సమస్యల గూర్చి సర్పంచ్  వార్డ్ మెంబర్స్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగ ఆ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం కేసారం గ్రామంలో ఆర్టీసీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  చేవెళ్ళ నుండి మల్కాపూర్ గ్రామానికి వెళ్లి రోడ్డు 2.70 కోట్లతో నిర్మించమన్నారు. మల్కాపూర్ నుండి కుమ్మెరకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయిందని సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దశల వారిగా పరిష్కరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ చేరి శివారెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. త్వరలో టిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నదన్నారు. అలాగే ఎమ్మెల్యే యాదయ్య మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాడని ప్రగాడ విశ్వాసాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్ గారి  విజయలక్ష్మి రెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి  మాలతి రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దల ప్రభాకర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామ గౌడ్, ఉప సర్పంచులు వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.