లీజుకు ఇచ్చిన ప్రజా రైతు మార్కెట్ అక్రమంగా క్రమబద్ధీకరణ

Published: Wednesday May 05, 2021

జిన్నారం/ ఐడీఏ బొల్లారం, మే 4 ప్రజాపాలన ప్రతినిధి : నాటి తాహశీల్ల్దార్, పంచాయతీ సిబ్బంది చేతివాటం. కోట్ల రూపాయల ప్రజా రైతుమార్కెట్ ఓ వ్యక్తికి ధారాదత్తం. లీజూకి ఇచ్చిన ప్రజా రైతు మార్కెట్ అధికారుల అలసత్వంతో ప్రజలకు ఉపయోగపడ వలసిన ఓ వ్యక్తి తన శ్రీమతి పేరిట, అలాగే తన పేరు మీద 59 జీవో కింద క్రమబద్దీకరించి కోట్ల విలువైన స్థలాన్ని చేజిక్కించుకున్న వైనం, బొల్లారం పారిశ్రమిక వాడలోని సర్వే నెంబర్ 284 లో 2004 నంబర్ లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదలకు 450 పట్టాలు అందజేశారు. అందులో మార్కెట్ కోసం 770 గజాల స్థలాన్ని కేటాయించింది. అందులో భాగంగా ప్రజలకు కు అందుబాటులో ఉండే విధంగా రైతు మార్కెట్ ను మార్చి ఎనిమిది 2011 లో ఆనాటి పంచాయితీ కార్యదర్శి ఆనంద్ మేరి, గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ప్రజా రైతు మార్కెట్ పేరున 33 సంవత్సరాలు మన్నె రామకృష్ణ w/o శారద పేరు మీద లీజుకు ఇచ్చారు.లీజుదారులు ప్రజా రైతు మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మే, 17, 2011 లో ఆనాటి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పటాన్ చెరు శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఇది కేవలం మూడు నాలుగు నెలల తర్వాత లీజు దారుడు చేతులు ఎత్తేయడంతో నిరుపయోగంగా మారింది. ఎలాగైనా ప్రజారైతు మార్కెట్ ను తనే సొంత చేసుకోవాలని కుట్ర పన్నారు. బై నెంబర్ తో టాక్స్, లీజు దారుడుతో పంచాయతీ సిబ్బంది కుమ్మక్కు. ప్రజా రైతు మార్కెట్ 9-83 కాగా పంచాయతీ సిబ్బంది లీజు దారుడుతో తో కుమ్మక్కు అయి 9-83/1,9-83/2 లాగా మార్చి లక్షలాది రూపాయలు దండుకున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్రమబద్ధీకరణ, మామ్ములకు అధికారుల వత్తాసు.......
2014 లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు అరవై గజాలు లోపు ఉన్న వారికి 59 జీవో, వంద గజాలు ఆపైన ఉన్నవారికి 58 జీవో ఇచ్చారు. దీన్నీ ఆసరాగా తీసుకుని లీజు దారుడుతో అధికారులు కుమ్మక్కు అయి 33 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన విషయాన్ని పక్కన పెట్టిన అవినీతికి తెరతీశారు.
2014 సంవత్సరం లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లను నిర్మించిన వారికే జీవో వర్తింపు.... 58,59 జీవో కింద 2014 సంవత్సరం లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లను నిర్మించిన వారికే తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. కాని ఏప్రిల్ ఆరో తేదీ 2017లో మన్నె రామకృష్ణ తన శ్రీమతి పేరిట 490 గజాలు, తన పేరిట 300 గజాలు ఆనాటి తహశీల్దార్ శివకుమార్, అక్రమంగా మామూళ్లు దండుకుని లీజు ఇచ్చిన ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది అని స్థానికులు చెబుతున్నారు. బొల్లారం లో 58,59 జీవో కింద 1936 మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు, కేవలం 799 మందికే క్రమబద్ధీకరణ.....బొల్లారంలో ని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న నిరుపేదలు 58, 59 జీవో కింద క్రమబద్దీకరణ కోసం 1936 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాని అధికారులు మాత్రం ముడుపులు ఇచ్చినవారికి మాత్రమే క్రమబద్దీకరణ చేసి మిగిలిన వారికి ఇప్పటి వరకు క్రమబద్దీకరించలేదు.... ఓవైపు కేవలం 799 మందికి మాత్రమే క్రమబద్దీకరించి, మిగిలిన 1137 మందికి ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదో ముడుపులు తీసుకుని క్రమబద్దీకరిస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2 వార్డు కౌన్సిలర్ వారాల గోపాలమ్మ. మాట్లాడుతూ 33 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన ప్రజా రైతు మార్కెట్ ను ఏవిధంగా క్రమబద్దీకరించారని దీనిపై పూర్తి స్తాయి విచారణ జరిపించాలని ఆమె అన్నారు, అలాగే 790 గజాల స్థలాన్ని క్రమబద్దీకరించిన తహశీల్దార్ శివకుమార్ ను, బై నెంబర్లను కేటాయించిన ఆనాటి పంచాయితీ సిబ్బంది ని సస్పెండ్ చేయాలని, 790 గజాల స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ను స్థానిక ప్రజలు కోరుతున్నారని...దరఖాస్తు చేసుకున్న అందరికీ క్రమబద్దీకరించాలి ఆమె డిమాండ్ చేశారు.. దరఖాస్తు చేసుకున్న అందరికీ క్రమబద్దీకరించాలి. కేవలం కొందరికి మాత్రమే చేసి మిగతా వారికి ఎందుకు చేయడంలేదు. తహశిల్దార్ శివకుమార్ ఉన్నప్పుడు అనేక అక్రమంగా క్రమబద్ధీకరణ చేశారు. సర్వే నెంబర్ 44లో 49 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు ఏఒక్కరికి చేయలేదు. బడా బాబు లకు మాత్రం ముడుపులు తీసుకుని క్రమబద్దీకరించారని దీనిపై పూర్తి స్తాయి విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నాను.