అటవీశాఖ అధికారుల నుంచి మాకు రక్షణ కల్పించాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆదివాసీ

Published: Wednesday November 02, 2022

భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల బుడ్డగుడెం గ్రామంలో గల మా గిరిజనుల భుములు లాక్కునేందుకు అటవీశాఖ అధికారులు కంకణం కట్టుకున్నారని ఈ క్రమంలో నిన్న సోమవారం ఉదయం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హక్కుల నిర్ధారణ కుడా  జరగకుండా మేము సేద్యం చేస్తున్న భూములలోకి వచ్చి మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా అటవీశాఖ అధికారులు కొట్టారని అటవీశాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని మా భూమి మాకు సాగు చేసేందుకు పట్టాలు చేసి ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆదివాసీ గిరిజన బిడ్డలు.వెంటనే స్పందించిన స్థానిక తహశీల్దార్ భగవాన్ రెడ్డి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా ఇట్టి విషయం ఉన్నతాధికారుల  దృష్టికి తీసుకు వెళ్లి దర్యాఫ్తు చెసి న్యాయపరంగా,న్యాయం చేందుకు కృషి చేస్తానని అప్పటి వరకు గొడవలకు వెళ్లి ఇబ్బందులు పడిద్దని ఆయన వారికి బదులిచ్చారు తహసిల్దార్ భగవాన్ రెడ్డి తో పాటు స్థానిక ఎస్సై పి.సంతోష్ ఉన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఉకే రవి మరియు సీపీఎం బూర్గంపాడు  మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు,మీడియం పుల్లయ్య,సొడే రాజు,మీడియం శ్రీను,సోడే వీరభద్రం,కృష్ణ,కాంచన, మడకం రాజారావు మరియు పలువురు ఆదివాసీ నాయకులు,ఆదివాసీ గిరిజన బిడ్డలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .