గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

Published: Tuesday January 31, 2023

జన్నారం, జనవరి 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గజ్జెల్లి చిరంజీవి గత కొన్ని నెలల నుండి సైనసిస్ నరాల వ్యాధి తో బాధపడుతున్న కమిటి సభ్యుడు,గల్ఫ్ కార్మికుడైన గజ్జెళ్లి చిరంజీవి గారి చికిత్స కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ ఆధ్వర్యంలో 22,200 రూపాయాలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మిక వ్యవస్థ అధ్యక్షులు కల్లేడ భూమయ్య మాట్లాడుతూ వలస కూలిగా గల్ఫ్ దేశంలో అబుధాబిలో పని చేస్తూ చాలి చాలన్నీ వేతనంతో జీవన్నాని కొన్నసాగిస్తున్నారు. ఇటు వంటి సమయంలో అతనూ అక్కడే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటు అక్కడే హాస్పిటల్ లో దాదాపు రెండు నెలలు ఐసియులో ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొంది కొంతవరకు బాగు అయ్యారు. పరాయి దేశంలో ఉన్నప్పుడు టిజీడబ్ల్యూడబ్ల్యూసి దుబాయ్ శాఖ కు తెలియగానే వ్యవస్థాపక అధ్యక్షులు కల్లేడ భూమయ్య, దుబాయ్ శాఖ అధ్యక్షులు మహ్మద్ అలీమ్, కునరపు రమేష్, కల్లెడ సత్యం, సందెల తిరుపతి, ధర్మజి సతన్న లు హాస్పిటల్ కి వెళ్లి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని స్వదేశామైన ఇంటికి పంపినందుకు సహకరించారు. వలస దేశం దుబాయిలో ఆరోగ్యం తక్కువ కకపోవడంతో చికిత్స కోసం  తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ సంస్థ, సభ్యులా సహకారంతో ఆర్థిక సహాయం అందజేస్తూ, గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తకొండ శేఖర్, వేముల సత్తయ్య, మాట్లాడుతూ సహాయానికి సహకరించినా దన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపై స్పందింస్తూ కార్మికులకు  ఏలాంటి సమస్యలు ఉన్న సంస్థ దృష్టికి వస్తే గల్ఫ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  లింగాల వెంకటేష్, సంగేపు వెంకటేష్, భూపెల్లి లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.