ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ కేంద్రం

Published: Saturday June 12, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 11 ప్రజాపాలన బ్యూరో : కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకల కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఎస్డిఐఎఫ్ (సోషల్ డాటా ఇనిషియేటీవ్ ఫోరం) అనే ఎన్జీవో సంస్థ ద్వారా ఉచిత సరఫరా చేస్తున్న ఆక్సిజన్ సిలిండర్ల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎస్ డిఐఎఫ్ సంస్థ వారు ఆక్సిజన్ సిలిండర్ ప్రజలందరికీ ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ యొక్క సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఇబ్బంది ఉన్న ప్రజలకు ఇంటి వద్దకే సరఫరా చేస్తారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన లాక్ డౌన్, ఫీవర్ సర్వే సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని ఇబ్బంది ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. రానున్న రోజుల్లో కరోనా మూడో వేవ్ రావొచ్చు, అని అధికారులు హెచ్చరిస్తున్నారు. కావున ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం, మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు సురేష్, అనంత్ రెడ్డి, గోపాల్, కృష్ణా రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, పట్టణ కోశాధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.