మున్సిపల్ హెచ్చరిక బోర్డులతో ప్లాట్లు శుభ్రం

Published: Wednesday December 07, 2022
మధిర రూరల్ డిసెంబర్ 6 (ప్రజా పాలన ప్రతినిధి)
మధిర మున్సిపాలిటీ పరిధిలోని లడక బజార్ అయ్యప్ప నగర్లోని ఖాళీ ప్లాట్లలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులతో పెరిగిన కంప చెట్లను ఫ్లాట్ల యజమానులు కొంతమంది స్వచ్ఛందంగా మంగళవారం జెసిబితో తొలగించి శుభ్రం చేయించారు. ఖాళీ ప్లాట్లలో  కంప చెట్లు పెరిగి విషపురుగులకు నిలయంగా మారి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని పలు పత్రికలలో కథనాలు రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి కంప చెట్లు పెరిగిన ప్లాట్లలో ఈ స్థలం మున్సిపాలిటీ వారిది ఆక్రమించిన ఎడల శిక్షార్హులు అని హెచ్చరిక బోర్డులను పెట్టించారు. దీంతో కొంతమంది ఫ్లాట్ల యజమానులు జెసిబితో తమ ప్లాట్లలో పెరిగిన కంప చెట్లను తొలగించుకున్నారు. కొంత మంది ప్లాట్ల యజమానులు మాత్రం కంప చెట్లను తొలగించుకోలేదు. మున్సిపల్ అధికారుల హెచ్చరిక బోర్డులతో తమ ఇళ్ల మధ్యలో పెరిగిన కంప చెట్లను తొలగించడంతో  అక్కడ నివసిస్తున్న  ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.