నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్.

Published: Saturday November 26, 2022
బెల్లంపల్లి నవంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యారంగంలో అసమానతలు పెంచుతుందన్నారు, అందుకే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని
ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్ అన్నారు. 
శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ముఖ్యంగా నూతన విద్యా విధానం  అమలవుతే మహిళలకి పూర్తిగా విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
పేదవారిని విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ విద్యా విధానం అని మండిపడ్డారు,
విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టి పేదవారికి విద్య అందకుండా  మారుస్తున్నారన్నారనీ,
దేశానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
  నేడు ఎక్కడ చూసినా  మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
 ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాదులో జరగుతాయని, ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
ఈ మహాసభలలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమ నిర్మాణం,  కార్యచరణ రూపొందిస్తామన్నారు...
 ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రయోజనాల కోసం, విద్యని కాషాయీకరణ చేయడం కోసం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు, విద్యని కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, దిశగా మార్చే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాడి నీలివర్మ, ధర్మాజీ సాయి గణేష్, పెద్దపల్లి సంజయ్, కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.