విద్యార్థులకు చదువుకు ప్రాధాన్యత నివ్వాలి : బొబ్బ నవత రెడ్డి

Published: Wednesday July 27, 2022

 

 శేరిలింగంపల్లి -ప్రజాపాలన/ జూలై 26 :పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకు విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి సూచించారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఉన్న తారానగర్ డబ్ల్యూఎస్సీ ప్రాథమిక పాఠశాలలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత నోట్ బుక్స్, పేన్సిల్స్, పెన్నులు, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు, మొదలగు వస్తువులను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని తన వంతు సహకారం అందజేస్తున్నానని తెలిపారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం వారు చదువుకుని అన్ని రంగాలలో రాణించాలన్న సదుద్దేశంతో గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు, మొదలు వస్తువులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవ సమితి చైర్మన్ కొండల్ రెడ్డి, చందర్ రావు, మాజీ వార్డ్ మెంబెర్ రమణకుమారి, షైఫుల్లహ ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి -ప్రజాపాలన/ జూలై 26 :పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకు విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి సూచించారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఉన్న తారానగర్ డబ్ల్యూఎస్సీ ప్రాథమిక పాఠశాలలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత నోట్ బుక్స్, పేన్సిల్స్, పెన్నులు, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు, మొదలగు వస్తువులను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని తన వంతు సహకారం అందజేస్తున్నానని తెలిపారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం వారు చదువుకుని అన్ని రంగాలలో రాణించాలన్న సదుద్దేశంతో గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు, మొదలు వస్తువులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవ సమితి చైర్మన్ కొండల్ రెడ్డి, చందర్ రావు, మాజీ వార్డ్ మెంబెర్ రమణకుమారి, షైఫుల్లహ ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.