వాసవి క్లబ్ గవర్నర్ పదవి నామినేషన్ దాఖలు. మంచిర్యాలబ్యూరో, సెప్టెంబర్29, ప్రజాపాలన :

Published: Saturday October 01, 2022

అంతర్జాతీయ వాసవి క్లబ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్టిక్ వి107 ఎ  వాసవి క్లబ్స్ నూతన గవర్నర్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. గవర్నర్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారి, వాసవి క్లబ్ అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేషన్లను అభ్యర్థుల నుంచి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ తరఫున అభ్యర్థిగా కొండ చంద్రశేఖర్ నామినేషన్ను మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలమాస్ ప్రవీణ్ లు గవర్నర్ అభ్యర్థి అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండ చంద్రశేఖర్ తో కలిసి ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రేణికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ , వాసవి క్లబ్స్ డిఇఎస్ టి వి 107ఎ పరిధిలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపెల్లి , భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలోని దాదాపు 60 వాసవి క్లబ్లు సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం గవర్నర్ ఎంపిక లో భాగంగా 2023 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ ఈరోజు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు కటకం హరీష్ , ముక్తా శ్రీనివాస్, పవిత్రం శ్రీనివాస్, ఎకిరాల శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, ప్రస్తుత గవర్నర్ కోఆప్షన్ సభ్యుడు బాల సంతోష్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్ , కోశాధికారి పుల్లూరి బాలమోహన్, వికేయస్పీఇంచార్జి అప్పాల శ్రీధర్ , క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ అక్కెనపల్లి రవీందర్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.