ఘనంగా బూడిద నందా రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Monday September 12, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు బూడిద నందా రెడ్డి 53 వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం మండలం నుండి బంధువులు ,మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున హాజరై శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలిచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని నందా రెడ్డితో పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లారీల అసోసియేషన్ ఉపాధ్యక్షులు బూడిద రాంరెడ్డి  లారీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పార్టీలకతీతంగా లారీ అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన బూడిద నందా రెడ్డి పలువురు అసోసియేషన్ నాయకులు తెలిపారు లారీ అసోసియేషన్ ఒకే కులంతో కుడి పనిచేస్తున్నామని ఎలాంటి పార్టీ విభేదాలు లేకుండా యూనియన్ అభివృద్ధిలో తీసుకు వెళ్ళే విధంగా పనిచేస్తున్నారని యూనియన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనీష్ రెడ్డి , కార్తీక్ రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ బుడిద నరసింహారెడ్డి, శ్రీనివాస్,  వెంకటేష్, గోపాల్,   భీమ్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకటేష్, నరసింహ, కర్ణాకర్, రవి, రమేష్ ,హరి, సురేందర్ రెడ్డి,  మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.