రైతులకు పంట పరిహారం చెల్లించాలి

Published: Friday October 01, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని ఆయొక్క పంటలను వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రైతు పొలం దగ్గరకు వెళ్లి రైతులకు జరిగిన నష్టాన్ని తనిఖీ చేసి రైతులకు జరిగిన నష్టాన్ని పరిహారము ఇవ్వవలసిందిగా రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. అదే విధముగా అన్ని రకాల పంటలు పత్తి వరి కూరగాయల పంటలు మరియు తనిఖీ చేసి రంగారెడ్డి జిల్లా మొత్తం రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అకాల వర్షాల వలన పంటలు దెబ్బతిని నష్టపోతే వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని, అందుకుగాను నాగలి పట్టుకునే  రైతులు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అందుకుగాను న్యాయస్థానము స్పందించి అంచనా వేసే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టుచెప్పినా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయ వేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు ఎలాంటి లాభం చేయడం లేదని, కావున బిజెపి రంగారెడ్డి జిల్లా కిసాన్మోర్చా రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.