*ఆరోగ్యంగా ఉన్న పశువులనే వదించాలి* డా.ధన్ రాజ్

Published: Saturday February 04, 2023
లక్షేట్టిపేట, ఫిబ్రవరి 03, ప్రజాపాలన.
 
 ఆరోగ్యంగా ఉన్న మేకలను గాని, గొర్రలను మోత్రమే వదించి మాంసము విక్రయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ ధన్ రాజ్ అన్నారు.  పట్టణంలోని  పశువైద్యాశాల ఆవరణంలో శుక్రవారం మాంస విక్రయదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో  పాల్గొని మాట్లాడారు. పట్టణంలోనే కాకుండా మండల పరిశర ప్రాంతాల్లో  మేకలు గొర్రెలను వదించి మాంసం విక్రయాలు చేస్తున్నవారు,  మేకను కోసేముందు పశువైద్యాధికారి పరిక్షచేసి ఆరోగ్యంగా  ఉంది అని అధికార స్టాంప్ వేసిన తర్వాతనే వదించి లైసెన్స్ ఉన్నవారు మాత్రమే విక్రయించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈగలు దోమలు దుమ్ము దులి పడకుండా చూసుకోవాలని అన్నారు.  లేని పక్షంలో అధికారిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, శనిటరీ ఇన్స్పెక్టర్ అజిమ్, పశువైద్య సిబ్బంది యాకుబ్ అలీ, తిరుపతి, ఏజస్ అలీ అభిలాస్, మాంస దుకాణ యజమానులు పాల్గొన్నారు.