గ్రామాలలో అంతర్గత రహదారుల పనులు పూర్తి చేయాలి ** జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవ రావు **

Published: Wednesday February 15, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
జిల్లాలోని 15 మండలాల పరిధిలోని గ్రామాలలో  అంతర్గత రహదారులు, సి. సి. రోడ్ల పనులన త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి పంచాయతీరాజ్ ఈ.ఈ.లు, డి.ఈ. లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలలో మంజూరు కాబడిన సి.సి. రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పనుల పురోగతి వివరాలు, ఫోటోలను పంపించాలని, ఎస్. టి. హ్యాబిటేషన్ గల గ్రామపంచాయతీ కార్యాలయాల కోసం త్వరితగతిన భూమిని గుర్తించి పనులు చేపట్టాలని తెలిపారు. మంజూరు కాబడిన నిర్మాణ పనులకు ఇసుక అవసరం కోసం సమాచారం అందిస్తే సంబంధిత తహసిల్దార్ తో  మాట్లాడి ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. సి.సి.రోడ్డు పనులను ఎఫ్.టి.ఓ.మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామాలలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు పనుల పురోగతిపై ఫోటోలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.