ఎమ్మెల్సీ ఎల్. రమణను సన్మానించిన సంఘ సభ్యులు...

Published: Friday February 04, 2022

జగిత్యాల, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాలలోని ఎల్. రమణ తన నివాసంలో  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. జగిత్యాల పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సప్తగిరి ట్రేడర్స్ వారి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పద్మశాలీ సంఘ సభ్యులు ఎల్. రమణకు శివపార్వతుల కాంష్య విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వొల్లాల గంగాధర్ ప్రధాన కార్యదర్శి భోగ గంగాధర్ సంఘ సభ్యులు మానపురి శ్రీనివాస్ ఆడెపు సత్యం ఎలిగేటి శంకర్ నాయకులు దయాల మల్లారెడ్డి చక్రపాణి కోరుకంటి రాము తదితరులు పాల్గొన్నారు.