ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

Published: Wednesday June 23, 2021

బెల్లంపల్లి, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బెల్లంపల్లి లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ, 1998లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు స్థానిక కెమికల్ ఏరియాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి టెస్లా యాజమాన్యానికి అనుమతి ఇచ్చిందని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన మెడికల్ కళాశాలను కేసీఆర్ ఇటీవల మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాల ను బెల్లంపల్లిలోనే ఏర్పాటు చేయాలని వారన్నారు, పేద ప్రజల పిల్లలు వైద్య విద్యను అభ్యసించేందుకు అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని దాన్ని తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అమలు చేసి తను శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజకుమార్ పాండే, పట్టణ అధ్యక్షుడు మనీ రామ్ సింగ్, పట్టణ ప్రచార కార్యదర్శి బొల్లు మల్లయ్య, పట్టణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు  ఎం, అచ్చయ్య, ఆర్, గంగాధర్ గౌడ్, సిహెచ్ రమేష్, పుల్లూరు పోశం, కొము రమ్మ, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.