ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో సర్వేనెంబ

Published: Wednesday November 09, 2022

మంగళవారం రోజున  అబ్దుల్లాపూర్ మెట్టుల వేసిన గుడిసెలను సందర్శించి వేసుకున్న గుడిసెలను పరిశీలించి గుడిసె తిరిగి గుడిసెలను బందోబస్తు వేసుకోవాలని సూచన చేస్తూ అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో మాట్లాడుతు, మీ గుడిసెల విషయంలో మీకు 60 గజాల స్థలం వచ్చేంతవరకు మీకు మద్దతుగా ఉంటానని అదేవిధంగా శాసనమండలిలో మాట్లాడుతానని ముఖ్యమంత్రి గారికి 60 గజాల స్థలం ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని మీ తరఫున నేను పోరాటం చేస్తానని అన్నారు. నిరుపేదలు 60 గజాల స్థలం కావాలని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే, రెవిన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు కేసులు పెట్టడం సరి అయింది కాదని ఇది చట్ట వ్యతిరేకమైందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులు భూకబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారి దగ్గరికి మాత్రం పోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయని, జాతీయ హైవే మీద ఉంది కాబట్టి భూములు రేట్లు పెరిగిపోవడంతో పేదవాడు 60 గజాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఈ స్థలంలో గతంలో ఇందిరమ్మ ఇండ్ల కింద లేఔట్ చేసే పట్టా సర్టిఫికెట్లు కూడా తయారుచేసి ప్రజలకు ఇయ్యలేదు కాబట్టి ఇప్పటికైనా ఇట్టి స్థలాన్ని పేద ప్రజలకు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఏ ,భాస్కర్ రెడ్డి , సిపిఎం మండల కమిటీ సభ్యులు గుండె శివ కుమార్, సిపిఎం నాయకులు కనకయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి, ఇరుగు బిక్షపతి, గుండె, సర్వయ్య, ప్రణయ్, మంగళపల్లి కిరణ్, మంగళపల్లి యాదయ్య, మందుల అనిత, ఓరుగంటి భాగ్యలక్ష్మి, విమల, రమాదేవి, పారిజాత, సౌజన్య, జీవిత, వందలాది మహిళలు జాతి హైవే దగ్గర నుండి గుడిసెల వరకు ఎమ్మెల్సీ గారితో స్వాగతం పలుకుతూ రాలిగా బయలుదేరడం జరిగింది.