పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు : స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ

Published: Monday May 03, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : రంజాన్ పండుగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీతో కలిసి కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ ముస్లిం సోదరులకు ప్రతి ఏడాది ఇచ్చె రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జరుగుతుందన్నారు. నీరుపేద ప్రజలకు అండగా ఉండాలని షాదిముబారక్, రంజాన్ తోఫా, ఆసర పింఛన్లు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పేట్టడం జరిగిందన్నారు. కరోనా వేంటాడుడుతున్న ప్రజలు కరోనా బారిన పడకుండా పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పేట్టడం జరిగిందన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ పండుగలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని రంజాన్ పండుగ, దసరా పండుగ, క్రిస్మస్ పండుగలకు నిరు పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి కానుకలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పాలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావు చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు, అక్బర్ ఖాన్, మెయిజ్, యుసుప్ పాషా, దాసు, అల్తాఫ్, సయ్యద్ పాషా, ఎల్ఐసి వేంకటేష్, మెయినోద్దిన్, సయ్యద్ పాషా,మాజిద్, షౌకత్,రవిందర్ రెడ్డి, నరేందర్ భాళ్ల, మార్టిన్, ఉమా శేఖర్, తదితరులు పాల్గొన్నారు.