విద్యుత్ శాఖసబ్ డివిజన్ ఇంజనీర్ లావణ్య కు సన్మానం మధిర

Published: Friday August 26, 2022
ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్వతంత్ర  వజ్రోత్సవాలలో విద్యుత్ శాఖ నుండి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సబ్ డివిజన్ ఇంజనీర్ లావణ్య ను సన్మానించిన ఏ డి ఈ సుధాకర్ రావు.స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలకు ఉమ్మడిగా నిర్వహించిన క్రీడా పోటీలలో విద్యుత్ శాఖ నుంచి పాల్గొన్న మదిర సబ్ డివిజన్ సబ్ ఇంజనీర్ లావణ్య వివిధ రకాల క్రీడల్లో గెలుపొంది పథకాలు సాధించిన సందర్భంగా మధిర సబ్ డివిజన్ ఏ డి ఈ  సి హెచ్  సుధాకర్ రావు  ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పథకాలు సాధించాలని , శాఖాపరమైన విధుల తోపాటు  క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధిర విద్యుత్ శాఖ రెవెన్యూ కార్యాలయం అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సిహెచ్ ప్రభాకర్ , మదిర సబ్ డివిజన్ మరియు ఈ ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు.