బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మధిర డిసెంబర్ 30 ప్రజాపాలన ప్ర

Published: Saturday December 31, 2022
బిఆర్ఎస్  పార్టీ కార్యాలయంలోమధిర నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ బీ.ఆర్.ఎస్.జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నాయకత్వం లో పార్టీ పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసంఅభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంమళ్ళీ రాష్ట్రంలో అధికారం బి ఆర్ ఎస్ పార్టీదేవచ్చే ఎన్నికల్లో మధిర అసెంబ్లీ లో బి ఆర్ ఎస్ జెండా ఎగరేస్తాంమధిర పార్టీ కార్యాలయంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ లో పార్టీ మండల ,టౌన్ కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు*
మధిర నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను శుక్రవారం నాడు మధిర పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల, టౌన్ కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీ బీ.ఆర్.ఎస్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీదే అధికారం అన్నారు మధిర నియోజకవర్గ అభివృద్ధి కోసం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు ఆయన   పార్టీ ఇంచార్జ్ గా ఆయన నాయకత్వంలో పార్టీ కి ప్రజల్లో మద్దతు పెరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో మధిర అసెంబ్లీలో కూడా అధికార పార్టీ బి ఆర్ ఎస్ అభ్యర్థి విజయం తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ దిశగా బి ఆర్ ఎస్ జెండా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగరవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, ఎంపీపీ మెండెం లలిత వెంకయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు  దీరావత్ మాధవి, అప్పారావు, ఇక్బల్, నాయకులు బోయపాటి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, యూత్ విభాగం మండల అధ్యక్షుడు అబ్బూరి రామన్, బోనగిరి నారాయణ, శీలం వెంకటరెడ్డి, మెండెం వెంకయ్య, గద్దల నాని, కొఠారి రాఘవరావు, తొగురు ఓంకార్, పల్లపోతుల ప్రసాద్, అయిలూరి ఉమామహేశ్వర రెడ్డి, జెవి రెడ్డి, అమిరినేని వెంకటేశ్వరరావు, గద్దల రాజా, ఆళ్ల నాగబాబు, జగన్నాథ చారి, శంకరా చారి, నాగరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు