చలో పాతర్ల పాడుచంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయండి

Published: Thursday June 23, 2022
టిడిపి మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధినియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు  టౌన్ మరియు రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, మార్నిడి పుల్లారావు  అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం , రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు  హాజరై నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రామనాథం మాట్లాడుతూ  ఎస్సీ ఎస్టీ బిసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక కర్షక మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారుసమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నాలుగు చెరగులా చాటారని, యావత్ భారతావని "అన్నఎన్టీఆర్"పిలువబడ్డారు అని కొనియాడారు. అలాంటి  మహనీయుడు, యుగపురుషుడు,శతజయంతి ఉత్సవాలు జరుపు కొనుట తెలుగు ప్రజల కర్తవ్యం అన్నారు.
    మొన్న ఒంగోలులో జరిగిన మహానాడుకు విచ్చేసిన ప్రజలను చూసి అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అన్నారు.
    2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని తెలిపారు. కేంద్ర ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు ఒకరిపై ఒకరు పరిపాలించే హక్కు లేదని విమర్శలు చేసుకుంటున్నారని, వారికి నిజంగానే పరిపాలించే హక్కు లేదని, ఒక తెలుగుదేశం పార్టీకే ఆ అధికారం ఉందని, తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించ పోతున్నారని అన్నారు.
     పార్టీ కి వెన్నుపోటు పొడిచి వివిధ పార్టీలకు పోయిన నాయకులందరూ తిరిగి సొంత పార్టీలోకి రావచ్చని హితవు పలికారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమమును కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి అత్యధికముగా సభ్యత్వ కార్యక్రమమును నిర్వహించాలని కోరారు.
    చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో ఈ నెల 24 తారీకు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  విచ్చేయుచున్నారు కావున మధిర నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు,  మండల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు,రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ హాజరై ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరారు   ఈ కార్యక్రమములో ఖమ్మం పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంగల్ రామకోటి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడిపల్లి రాణి, గడ్డం రమేష్, నాగులవంచ శ్రీనివాసరావు, చెటారీ ముసలి,