కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ డా. భోగ.శ్రావణిప్రవీణ్

Published: Wednesday September 28, 2022

జగిత్యాల, సెప్టెంబరు 27 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ అంగడి బజార్ యందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహమునకు మున్సిపల్ చైర్పర్సన్ డా. భోగ.శ్రావణిప్రవీణ్ పూల మాల వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్బముగా చైర్పర్సన్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని కొనియాడారు. కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీని స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో న్యాయవాదిగా సేవలందించి, ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అన్నారు. మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారన్నారు. ఆ విలువలను జీవితాంతం పాటిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆ స్ఫూర్తిని పంచారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిసనర్ గంగాధర్, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు గట్టు సతీష్ , బీజేపీ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి, ఆనందరావ్, పద్మశాలి సంఘము అధ్యక్షులు  ఆకుబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చింతకింది రవి చందు, ప్రధాన కార్యదర్శి తటిపముల వినోద్ కుమార్, సహాయ కార్యదర్శి భోగ రాజు, కౌన్సిలర్స్, దాసరి లావణ్య ప్రవీణ్, అడ్వాల జ్యోతి  లక్షన్, అల్లే గంగసాగర్, క్యాదాసు నవీన్, గుర్రం రాము, హనుమండ్ల జయశ్రీ, డిఈ రాజేశ్వర్, ఎస్ఐఅశోక్ రాము కార్యాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.