పేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

Published: Saturday April 08, 2023
ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
పేదల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి కొనియాడారు.
 ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి నివాసంలో హబ్సిగూడ డివిజన్
 బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి.వి చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హబ్సిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా  ఎమ్మేల్యే బేతి సుభాష్ పాల్గొన్నారు.   
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ప్రతీ కాలనీలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోను కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, లేతాకుల రఘుపతి రెడ్డి, వనంపల్లి గోపాల్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, మనోహర్,నరేంద్ర రాజు,పద్మరెడ్డి, యాకాంత రావు, నంది కంటి శివ, కొంగల శ్రీధర్, వెళ్ళంకి రవీందర్ రెడ్డి, దాచేపల్లి శ్రీధర్, రహమాన్, హరీష్ ,సిద్ధి రాములు, బాబు,రాజు, వంశీ, సర్ప రాజ్,పుట్ట కృష్ణ, డీజే సాయి, కొంగల నరసింహ, నాని, అద్వైత్ రెడ్డి, గణేష్,మహిళలు యాదమ్మ ,భాగ్యలక్ష్మి ,ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యరేఖ ,మహబూబి, నలిని రెడ్డి, పద్మ,జ్యోతి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు,పార్టీ శ్రేణులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.