యూత్ కాంగ్రెస్స్ ఆధ్వర్యంలో మధిర ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన

Published: Friday June 04, 2021
మధిర, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపల్ పరిధి ఈరోజు స్థానిక శాసనసభ్యులు సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క గారి ఆదేశానుసారం మధిర పట్టణం నందు గల సామాజిక ఆరోగ్య కేంద్రంను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగిందిఆరోగ్య కేంద్రంలో కోవిడ్ రోగులు పొందుతున్నటువంటి వైద్య సేవలు సౌకర్యాలు ఆక్సిజన్ బెడ్స్ అలాగే డాక్టర్ల పర్యవేక్షణ ఎలా ఉందని తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోవిడ్ బారిన పడినటువంటి బాధితులు బ్లడ్ టెస్ట్ లకు బయటకు వస్తున్నారని అలాగే భోజన సదుపాయాలు లేవని తెలపడం జరిగింది ఈ విషయాన్ని డ్యూటీ డాక్టర్ రమా గారు ని అడగగా సి ఆర్ పి లాంటి టెస్ట్ లు చేయడానికి సదుపాయాలు లేవని ఉంటే బయటికి రాయమని చెప్పడం జరిగిందిఅలాగే ప్రతిరోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తక్కువ జరుపుతున్నారని ఈ విషయాన్ని తెలుసుకొని సాధ్యమైనంత వరకూ ఎంతమంది పరీక్షల నిమిత్తం వచ్చినా వారందరికీ నిర్ధారణ పరీక్షలు జరిపి పాజిటివ్ గా వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ పంపించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది అలాగే రెండు రోజుల క్రితం మధిర కు వచ్చిన తెలంగాణ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధిర నందు గల ఒక ఆస్పత్రిని కూడా సందర్శించకుండా మదిరలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ఉన్నత అధికారి ఆడంబరంగా వచ్చి కేవలం ప్రభుత్వ అధికారులతో చర్చించి ప్రజాప్రతినిధులను గాని పత్రికా విలేకరులను గానీ కలవకుండా ప్రజల సమస్యలను వినకుండా లక్షలు ఖర్చు చేసి ఆర్భాటంగా వచ్చి వెళ్ళినారు ఇప్పటికీ కూడా మధిర ప్రాంత ప్రజలు వారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారు ఇక్కడికి వచ్చి ఏం తెలుసుకున్నారు అనేది ఎవరికీ తెలియదు ప్రభుత్వం కేవలం ఏదో చేస్తున్నట్టు ప్రజల ముందు నటించేందుకు అధికారులను హెలికాప్టర్లో పంపించ్చిందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది అలాగే మధిర ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం ఒక అంబులెన్స్ మాత్రమే ఉండటం వల్ల ఎక్కువమంది రోగులు అస్వస్థతకు గురి కావడం వల్ల జిల్లా ఆస్పత్రికి లేదా వేరే ఆస్పత్రికి తరలించాలి అంటే అంబులెన్సులు వేలకు వేలు ఖర్చు చేయవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఆసుపత్రికి మూడు అంబులెన్సులను మంజూరు చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసిందిఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు కోరం పల్లి చంటి, కోట రమేష్, ఆవుల కార్తీక్, కె రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు