మధిర తహసీల్దార్గా ఎవరు రానున్నారు

Published: Tuesday December 14, 2021
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి తాహసీల్దార్గా పనిచేసిన సైదులు కొనిజర్లకు బదిలీ అయి ముప్పై నాలుగు రోజులు గడుస్తున్నా నేటికీ అధికారులు మధిర నూతన తహశీల్దార్ కేటాయించలేదు. ముగ్గురు తహసీల్దార్లు మధిర పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెల 14 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఖాళీగా ఉన్న మధిర తహశీల్దార్ పోస్టు భర్తీ చేయటం ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. త్వరలోనే మధిరకు నూతన తహశీల్దార్ రాబోతున్నట్లు సమాచారం